హీటెక్కిస్తున్న ఎండలు.. ధరూర్​లో 44.2 డిగ్రీలు

గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో రానున్న 5 రోజులపాటు మరింత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సంతోష్​ ​ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ధరూర్ మండలంలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటిక్యాల మండలం సాతర్లలో  44.0 డిగ్రీలు, అలంపూర్ లో 43.9, గద్వాల 43.2, కేటీ దొడ్డి వడ్డేపల్లి లో 43.0, అయిజ లో 42.0, రాజోలి, ఇటిక్యాల, మానవపాడులో 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.