మైనర్లు షికార్లు చేసేందుకు వెహికల్స్ ఇవ్వొద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అయితే కొంతమంది ప్రభుత్వ హెచ్చరికలు పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ మైనర్ బాలుడు టూవీలర్ ను డ్రైవ్ చేసినందుకు ఆర్టీఏ అధికారులు రూ.26వేలు ఫైన్ విధించారు.
భువనేశ్వర్ లోని కాందాగిరికి చెందిన నిరంజన్ దాస్ మైనరైన తన కొడుకు డ్రైవ్ చేసుకునేందుకు టూవీలర్ వెహికిల్ ఇచ్చాడు. కొడుక్కి బైక్ అంటే ప్రాణం. అడగ్గానే తండ్రి బైక్ ఇచ్చాడని.. ఆ బైక్ పై షికార్లు చేశాడు కొడుకు. చివరికి ఆర్టీఏ అధికారులు రూ.26వేల చలాన్ విధించారు. మైనర్లు బైక్ డ్రైవ్ చేయకూడదు. దానికి తోడు హెల్మెట్ ధరించలేదని రీజన్ చెప్పారు. మోటర్ వెహికల్ యాక్ట్ 2019 ప్రకారం మైనర్లు టూవీలర్ డ్రైవ్ చేయకూడదు. అలా చేసినందుకు రూ.26వేలు ఫైన్ తో పాటు బైక్ ను సీజ్ చేశామని నిరంజన్ దాస్ కు నోటీసులు జారీ చేశారు.
