ఇంటర్ పాసైతే స్కూటీ గిఫ్ట్.. స్కూల్‌కి వెళ్తే రోజుకి వంద

ఇంటర్ పాసైతే స్కూటీ గిఫ్ట్.. స్కూల్‌కి వెళ్తే రోజుకి వంద
అస్సాం కొత్త ప్రోగ్రాం ఆడపిల్లల చదువు ప్రోత్సాహమే లక్ష్యం జనరేషన్లు మారుతున్నాయ్. టెక్నాలజీలు పెరుగుతున్నాయ్. కానీ, ఇంకా చాలాచోట్ల ఆడపిల్లలు చదువుకు దూరంగానే ఉంటున్నారు. అందుకే అస్సాం సర్కార్ ఆడపిల్లల చదువును ప్రోత్సహించడానికి కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ప్రతీరోజూ వాళ్లు స్కూలు, కాలేజీలకు వెళితే వంద రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఇంటర్మీడియట్, ఆపై చదివే ఆడపిల్లలు పుస్తకాలు కొనుక్కోడానికి మూడు వేల రూపాయలు ఇవ్వనుంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్‌లో పాసయిన అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. దీంతో ఈ సంవత్సరం 22వేలకు పైనే స్టూడెంట్స్​కు స్కూటీలు అందజేయనున్నారు. For More News.. డిజిటల్‌ కరెన్సీకి పెరుగుతున్న ప్రాధాన్యత ఫార్మింగ్‌లోకి వచ్చే ఉద్దేశం లేదు రెస్టారెంట్‌కు వెళ్లిన ఇండియన్ ప్లేయర్లకు లైన్ క్లియర్