సూపర్ బనానా (అరటికాయ) వచ్చేసింది.. కోట్ల మందిని బతికిస్తుంది..

సూపర్ బనానా (అరటికాయ) వచ్చేసింది.. కోట్ల మందిని బతికిస్తుంది..

ఆఫ్రికాలోని సబ్-సహారా, ఇతర ప్రాంతాల్లో ఐదేళ్లలోపు ఉన్న పిల్లల్లో 30 శాతం మంది అంధత్వంతో బాధపడుతున్నారు. అదీ.. ఒక్క ‘ఏ’ విటమిన్ లోపం కారణంగానే...  పౌష్టికాహార లోపం వల్లే వీరికి ఈ ముప్పు ఏర్పడుతోంది. అందుకే.. వీరికి ఏ విటమిన్ అధికంగా, సులభంగా అందించే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించారు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ టెక్నాలజీ పరిశోధకులు. వీరికి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇంకేం.. ఏ విటమిన్ పుష్కలంగా ఉండే సూపర్ బనానాలను జెనెటిక్ ఇంజనీరింగ్ చేసిన వీరు సృష్టించారు.  దీనిని సూపర్  21 పేరుతో ..ఈ ప్రాజెక్ట్ 2005 లో ప్రారంభించారు. 18 ఏళ్లు కష్టపడిన తరువాత  శాస్త్రవేత్తలు ఈ విజయం సాధించారు.

ఆఫ్రికా,ఆగ్నేయాసియా  దేశాల  ప్రజలు విటమిన్ ఎ  లోపంతో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు.  ఆ దేశాల్లో  పిల్లల ఎదుగుదల లోపంతోపాటు   అంధత్వంతో  కూడా  బాధపడుతున్నాడు.  వ్యాధి నిరోధక శక్తి లేకపోవడంతో అతిసారం, తట్టు వంటి ప్రాణాంతక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. 
 
సూపర్ అరటితో అంధత్వానికి చెక్

ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే అరటిపండ్లు తినాలని సూచించారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఎ, సి మరియు బి-6, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు శరీరాన్ని బలపరుస్తాయి. రోగనిరోధక శక్తిని  అరటిపండు పెంచుతుందని శాస్త్రవేత్తలు  చెబుతున్నారు.  అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు జెనిటిక్ సూపర్ బనానాను సిద్ధం చేశారు. ఇందులో చాలా ఎక్కువ పోషకాలు , విటమిన్లు ఉంటాయి.ఇది తిన్న వారికి చాలా రోగాలు రావని చెబుతున్నారు.  అంతేకాదు ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ సూపర్ బనానా తింటే కోలుకుంటారట.   ఇది ఒక దివ్యౌషధంగా నిరూపించబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

పోషకాహార లోపంతో బాధపడుతున్న  వారికి ఈ సూపర్ బనానా చాలా  ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.   సూపర్‌బనానా సాగుకు సిద్ధంగా ఉంది కానీ.... స్థానిక ప్రభుత్వం నుండి అనుమతి కోసం శాస్త్రవేత్తలు  ఎదురు చూస్తున్నారు.  అయితే ఉగాండాలో జన్యుపరంగా మార్పు చేసిన ఆహారపదార్థాల వాడకంపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో  ప్రభుత్వం దానిని ఆమోదించడానికి వెనుకాడుతోంది.

 ప్రపంచవ్యాప్తంగా 190 మిలియన్లు  తక్కువ వయస్సు ఉన్న పిల్లలు విటమిన్ ఎ లోపంతో ఉన్నారు.  కేవలం ఆఫ్రికాలోనే  6% బాల్య మరణాలు పోషకాహారలోపంతో జరుగుతున్నాయని  ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా  వేసింది. పోషకాహార లోపంతో పోరాడుతున్న అనేక ఆఫ్రికా దేశాలలో ఉగాండా ఒకటి. ఇంత జరుగుతున్నా సూపర్ బనానా సాగుకు అక్కడి  ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు.

ప్రతి గ్రామంలోనూ 10 సూపర్‌బనానా మొక్కలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచితంగా మొక్కలు తీసుకున్న ఒక్కో రైతు 20 చొప్పున కొత్త అరటి మొలకలను మరొక రైతుకు ఇవ్వాలని షరతు పెడతారు కాబట్టి.. ఉచితంగానే ఇంటింటికీ సూపర్‌బనానాలను అందించొచ్చన్నది వీరి ఐడియా. ఇది బాగా అమలైతే ఇక ఆఫ్రికా పిల్లల జీవితాల్లో వెలుగులు నిలిచినట్లే.. మరి అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. . .