న్యూఢిల్లీ: దేశంలో కరోనా మరణాల లెక్కలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సైన్స్ అబద్ధం చెప్పదని, ప్రధాని మోడీయే ఆ పనిచేస్తారని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కరోనాతో దాదాపు 47 లక్షల మంది చనిపోతే.. కేంద్రం మాత్రం 4.8 లక్షల మంది చనిపోయారని అబద్ధం చెబుతోందని ఆరోపించారు. ఇండియాలో వైరస్ బారిన పడి 47 లక్షల మంది చనిపోయినట్లు డబ్ల్యూహెచ్‌వో రిపోర్టును ఆయన ప్రస్తావించారు. దీనికి సంబంధించిన లెక్కలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కొవిడ్‌తో తమ వారిని కోల్పోయిన కుటుంబాలను గౌరవించి వారికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
