వికారాబాద్​లో త్వరలో సైన్స్​ సెంటర్.. అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​ జిల్లా కేంద్రంలో త్వరలో సైన్స్ ​సెంటర్​ను ప్రారంభిస్తామని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​వెల్లడించారు. వికారాబాద్​లోని కొత్తగడి గురుకుల స్కూల్​లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫైర్ ​ముగింపు కార్యక్రమానికి ఆయన చీఫ్ ​గెస్ట్​గా హాజరయ్యారు. 

ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మెమెంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్ ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా,  వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 

కార్యక్రమంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, డీఈఓ రేణుకాదేవి, జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్​రావు, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్​లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేశ్, కౌన్సిలర్లు ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి , ప్రిన్సిపల్ సాయిలత పాల్గొన్నారు.