స్టూడెంట్లకు పూలతో స్వాగతం పలుకుతున్న స్కూల్స్

స్టూడెంట్లకు పూలతో స్వాగతం పలుకుతున్న స్కూల్స్
రండి.. రండి.. ఢిల్లీ స్టూడెంట్లకు పూలతో స్వాగతం న్యూఢిల్లీ: కరోనా లాక్‌‌‌‌డౌన్ కారణంగా మూతపడిన స్కూల్స్‌‌‌‌ పదినెలల తరువాత తెరుచుకున్నయ్. కంటెయిన్‌‌‌‌మెంట్‌‌‌‌ జోన్లకు బయట ఉన్న స్కూళ్లన్నీ ఓపెన్‌‌‌‌ చేసుకోవచ్చని ఢిల్లీ సర్కారు ప్రకటించింది. స్టూడెంట్స్‌‌‌‌కు ఫిజికల్‌‌‌‌ అటెండెన్స్‌‌‌‌ కంపల్సరీ కాదని, పేరెంట్స్‌‌‌‌ అనుమతితోనే స్కూల్‌‌‌‌కు రావాలని స్పష్టంచేసింది. క్లాస్‌‌‌‌ 10, 12 చదివే స్టూడెంట్స్‌‌‌‌కు మే 4 నుంచి బోర్డు ఎగ్జామ్స్‌‌‌‌ కండక్ట్‌‌‌‌ చేస్తామని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ప్రకటించింది. ఈ క్రమంలో స్కూళ్లలో ఫిజికల్‌‌‌‌ క్లాసులు స్టార్ట్‌‌‌‌ చేశారు. కొన్ని స్కూల్స్‌‌‌‌లో బెలూన్లు, పువ్వులు, శానిటైజర్లతో స్టూడెంట్స్‌‌‌‌కు టీచర్లు వెల్‌‌‌‌కమ్‌‌‌‌ చెప్పారు. స్కూల్‌‌‌‌లో స్టూడెంట్స్‌‌‌‌ను చూడడం ఆనందంగా ఉందని ఢిల్లీ సీఎం అరవింద్‌‌‌‌ కేజ్రీవాల్‌‌‌‌ ట్వీట్ చేశారు. చిరాగ్‌‌‌‌ ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లోని స్కూల్​ను డిప్యూటీ సీఎం మనీశ్‌‌‌‌ సిసోడియా సందర్శించారు. రాజస్థాన్​లో 50% సీటింగ్‌‌‌‌ కెపాసిటీతో స్కూల్స్‌‌‌‌ రీఓపెన్ చేసుకోవచ్చని అక్కడి సర్కారు పర్మిషన్ ఇచ్చింది. దీంతో క్లాస్‌‌‌‌ 9 నుంచి 12 స్టూడెంట్ల కోసం సోమవారం స్కూళ్లను రీఓపెన్‌‌‌‌ చేశారు. రీఓపెన్ సందర్భంగా ఆదివారం అన్ని స్కూళ్లలో శానిటైజేషన్ చేశారు. For More News.. రిపబ్లిక్ డే ‘ట్రాక్టర్ ర్యాలీ’పై నిర్ణయం పోలీసులదే బైడెన్ ప్రమాణ స్వీకారానికి గతంలో ఎప్పుడూ లేనంత సెక్యురిటీ మహారాష్ట్ర – కర్నాటక బార్డర్ ఫైట్.. ఇంచు కూడా వదలమంటున్న కర్నాటక