కేరళలో బడులు తెరుచుకున్నయ్
తిరువనంతపురం: దాదాపు తొమ్మిది నెలల తరువాత కేరళ బడులు జనవరి 1 నుంచి ఓపెన్ అయ్యాయి. స్టూడెంట్స్‌కు కరోనా సోకకుండా రూల్స్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్కులు పెట్టుకోవడడం, తరచూ చేతులు కడుక్కోవడం, సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ పాటించడం తప్పనిసరి చేశారు. బడిలోకి ఎంటర్ కాగానే టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. పేరెంట్స్నుంచి అనుమతి పత్రం తీసుకొస్తేనే క్లాసులోకి అనుమతిస్తున్నారు. ఇప్పుడు 10,12 క్లాసుల స్టూడెంట్స్‌కు మాత్రమే కొన్ని గంటలపాటు పాఠాలు చెబుతున్నారు. చాలా నెలల తరువాత ఫ్రెండ్స్‌ను, టీచర్స్‌ను కలుసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించిందంటూ 12వ తరగతి స్టూడెంట్ అఖిల చెప్పింది. ఆన్లైన్ క్లాసులు బోర్ కొడుతున్నాయని, స్కూలుకు రావడమే బాగుందని మరో స్టూడెంట్ పార్వతి వివరించింది.
For More News..
వీసాలపై నిషేధాన్ని పొడిగించిన ట్రంప్
స్నేహితుడి పెళ్లికి వెళ్లొస్తుండగా ఆక్సిడెంట్.. ఇద్దరు మృతి
సీపీఎం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
