అదుపుతప్పిన స్కూల్​ బస్సు... పిల్లలకు తప్పిన ప్రమాదం

చేవెళ్ల, వెలుగు: చేవెళ్ల మండలంలోని చన్ వెళ్లి అనుబంధ గ్రామం ఇక్కరెడ్డిగూడ శివారులో మంగళవారం ఉదయం స్థానిక సిల్వర్​ డే స్కూల్​ బస్సు అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు.7వ తరగతి చదువుతున్న వర్షిత వాంతులు చేసుకోగా.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. సిల్వర్​ డే స్కూల్​ బస్సు ఉదయం విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

విషయం తెలుసుకున్న పేరెంట్స్​ అక్కడికి చేరుకున్నారు. పరిమితికి మించి పిల్లలను ఎక్కించుకున్నారని, అతివేగంగా డ్రైవ్​ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పేరెంట్స్​ ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న ఆర్డీఓ ఘటనాస్థలానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సుకు పిట్​నెట్​ లేకపోవడంతో సీజ్​ చేసి పోలీస్​ స్టేషనకు తరaించారు. కొన్ని రోజుల ముందు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బస్సు ప్రమాదం జరిగిందని, ఇప్పుడు ఈ ఘటన జరగడంపై  విచారణ జరపాలని పీడీఎస్​యూ చేవెళ్ల డివిజన్ సహాయ కార్యదర్శి పంబలి ప్రభాస్ డిమాండ్​ చేశారు.