నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్

లింగాల, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆదేశాల మేరకు లింగాల మండల కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు.  ఈ డ్రైవ్​లో   20 వాహనాలను సీజ్ చేశామన్నారు.

 15 నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, 5 మైనర్ డ్రైవింగ్ వాహనాలను పట్టుకున్నట్టు తెలిపారు.  నెంబర్ ప్లేట్  లేకుండా వాహనం నడిపినా,  మైనర్లు  డ్రైవింగ్ చేసినా, తాగి వాహనాలు నడిపినా చర్యలు తీసుకుంటామన్నారు.  మైనర్లు డ్రైవింగ్​ చేస్తే..  తల్లితండ్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.