నోటాపై అభిప్రాయం చెప్పండి: కేంద్రానికి, ఈసీకి సుప్రీం నోటీసులు

నోటాపై అభిప్రాయం చెప్పండి: కేంద్రానికి, ఈసీకి సుప్రీం నోటీసులు

ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను ఇవాళ(సోమవారం) సుప్రీం కోర్టు విచారించింది. నోటాకు అత్యధిక ఓట్లు పోలైన సందర్భంగా  ఆ నియోజకవర్గంలో మళ్లీ ఎన్నికలు జరిపించాలని కోరుతూ బీజేపీ నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ పిల్ వేశారు. ఈ పిటిషన్ ను సుప్రీం చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం విచారించింది.

విచారణ సందర్భంగా పిటిషన్ తరపున  లాయర్ మేనకా గురుస్వామి వాదించారు.  ప్రస్తుతం నోటాకు అభ్యర్థుల్ని నిరాకరించే హక్కు మాత్రమే ఉందని, దాన్ని ఓటుగా గుర్తించాలని కోరారు. ఈ క్రమంలో...దీనిపై అభిప్రాయాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వం,  ఎన్నికల సంఘానికి... సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.