దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 169 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఇన్ ఇంజనీర్- (సివిల్, ఎలక్ట్రికల్, ఫైర్) విభాగాల్లో ఈ ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులుఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 160
విభాగాల వారీగా ఖాళీలు:
- అసిస్టెంట్ మేనేజర్ (సివిల్): 42
- అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్): 25
- అసిస్టెంట్ మేనేజర్ (ఫైర్): 101
అర్హతలు:
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్- సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టులకు అభ్యర్థులు సంబంధిత డిగ్రీ (సివిల్/ ఎలక్ట్రికల్) కలిగి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్-ఫైర్) పోస్టులకు అభ్యర్థులు BE (ఫైర్) లేదా BE/B Tech (సేఫ్టీ & ఫైర్ ఇంజినీరింగ్, ఫైర్ టెక్నాలజీ & సేఫ్టీ ఇంజనీరింగ్, ఫైర్ సేఫ్టీ సంబంధిత విభాగాల్లో సమానమైన 4 సంవత్సరాల డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
01/ 10/ 2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్- సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టులకు 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీర్-ఫైర్) పోస్టులకు21 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వడ్ క్యాటగిరి అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము:
జనరల్/ OBC/EWS అభ్యర్థులు రూ.750/- దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST/PwD అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ALSO READ : JOB NEWS : మాజ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లో నాన్ ఎగ్జిక్యూటివ్స్
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులు ప్రారంభ తేది: 22/ 11/ 2024
- దరఖాస్తులకు చివరి తేది: 12/ 12/ 2024