నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : పరీక్ష లేకుండానే SBIలో 1,040 జాబ్స్

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. స్పెషలిస్ట్ కెడర్ ఆఫీసర్(SCO) పోస్టుల భర్తీ  కోసం జూలై 19న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్ట్ 8లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్​అభ్యర్థులు రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఓబీసీ, దివ్యాంగులు, ఎస్​టీ, ఎస్సీ వారికి ఫీజు లేదు. sbi.co.inలో అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎక్స్​పీరియన్స్ కచ్చితంగా ఉండాలి.

పోస్టుల వివరాలు ఇలా

రిలేషన్​షిప్ మేనేజర్-(273)వీపీ వెల్త్​(643), రిలేషన్​షిప్ మేనేజర్​టీమ్​ లీడ్(32),ఇన్వెస్ట్​మెంట్ ఆఫీసర్ (49), ఇన్వెస్ట్​మెంట్ స్పెషలిస్ట్ (30) ,రీజినల్​హెడ్​(6), ఇంకా ఇతర ఆఫీసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్​బీఐ బ్యాంక్ బ్రాంచుల్లో పోస్టింగ్ ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్

పోస్టును బట్టీ వయోపరిమితి, విద్యా అర్హతలు నోటిఫికేషన్ లో డీటెల్ గా ఇచ్చారు. పోస్టులు బట్టి డిగ్రీ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఎం లేదా సీఏ, సీఎఫ్​ఏ చదివి ఉండాలి. NISM ఇన్వెస్ట్​మెంట్ అడ్వైజర్, రీసెర్చ్​అనలిస్ట్ సర్టిఫికెట్, సీఎఫ్​పీ, ఎన్​ఐఎస్​ఎం కోర్సులతోపాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల క్వాలిఫికేషన్స్, ఎక్స్​పీరియన్స్ ఆధారంగా వారిని షార్ట్ లిస్ట్​ చేస్తారు. తర్వాత వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కర్షన్ ఉంటుంది. వాటిలో సెలక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.