మహనీయురాలు సావిత్రిబాయి పూలే : పురుషోత్తం

బషీర్ బాగ్, వెలుగు: సావిత్రిబాయి పూలే పుట్టిన రోజును మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం శుభ పరిణామం అని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పురుషోత్తం అన్నారు. సావిత్రి బాయి 194వ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో రాష్ట్ర  ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఫెడరేషన్​ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

 ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్​తోపాటు ప్రజా కవి జయరాజు, ఇంటర్మీడియెట్ బోర్డు రీజనల్ డైరెక్టర్ జయప్రద, స్కూల్​ఎడ్యుకేషన్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. సావిత్రి బాయి పూలే ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళల విద్యా హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన తొలితరం టీచర్ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.