మద్యం నిల్వలపై దృష్టి పెట్టాలి : సౌరబ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గ్రామాలు, పట్టణాల్లో అక్రమ మద్యం నిల్వలపై ఎక్సైజ్  అధికారులు దృష్టి పెట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సౌరబ్  ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో కలెక్టర్  ఉదయ్ కుమార్ తో కలిసి ఎక్సైజ్  అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బార్లు, మద్యం దుకాణాలను తనిఖీ చేయాలని, రోజువారీ మద్యం అమ్మకాలకు సంబంధించిన రికార్డులు పరిశీలించాలని సూచించారు. సరిహద్దు చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా పెట్టాలని ఆదేశించారు. మద్యం అమ్మకాలు, షాపులకు వెళ్లే సరకు రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఎక్సైజ్  ఆఫీసర్​ గాయత్రి పాల్గొన్నారు.