అంబర్పేట, వెలుగు: సత్యసాయి శత జయంతి ఉత్సవాలను నవంబర్15 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షుడు నిమీష్ పాండ్య తెలిపారు. ఆదివారం నల్లకుంటలోని శివం టెంపుల్లో ఆయన మాట్లాడారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో వేడుకలు జరుగుతాయన్నారు. దేశ, విదేశాల నుంచి సుమారు15 లక్షల మంది భక్తులు వస్తారని, తాత్కాలిక వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
