శని నక్షత్రం మారుతున్నాడు.. ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుందంటే... 

శని త్వరలో నక్షత్రం మారబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఫలితంగా వారి భవిష్యత్ కూడా మారిపోతుంది. . ఏప్రిల్ 6న శని గ్రహం  సంచరించే నక్షత్రం మారగా..  ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. శని కదలికలోని ఈ ప్రధాన మార్పులు కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకొస్తాయి. ఏయే రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

 శని పేరు చెప్తేనే అందరూ భయపడతారు. ఎలాంటి కష్టాలు వస్తాయో, జీవితం ఎలా మారిపోతుందో అని ఆందోళన చెందుతారు. కానీ శని అనుగ్రహం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. కర్మల అనుసారం శని దేవుడు ఫలితాలని ఇస్తాడు. అందుకే న్యాయదేవుడిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో శనికి ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహాలలో శని ఒకటి. ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు ముప్పై సంవత్సరాలు పడుతుంది.

ALSO READ | ఇలా వాట్సాప్​ చాట్​లో.. 3 మెసేజ్​లను పిన్ చేయొచ్చు

గతేడాది తన సొంతరాశి అయిన కుంభ రాశి ప్రవేశం చేసిన శని ఈ ఏడాది మొత్తం అదే రాశిలో ఉంటాడు. రాశి మారకపోయినా తన కదలికలు మార్చుకుంటూ ఉంటాడు. అయితే శని ఇప్పుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సూర్యగ్రహణం ఏర్పడడానికి రెండు రోజులు ముందు  ( ఏప్రిల్​ 6) శని ప్రస్తుతం ఉన్న నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ప్రస్తుతం శని శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 6న పూర్వభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్లో మళ్ళీ శతభిషా నక్షత్రానికి వెళతాడు.శని నక్షత్ర మార్పు.. ఆకస్మిక ధనలాభంతో ఈ రాశుల వారి భవిష్యత్ కూడా మారబోతుంది

మేష రాశి: పూర్వభాద్ర పద నక్షత్రంలో శని సంచారం మేష రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల నుండి డబ్బు చేతికి అందుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి ఉంటే మంచిది లాభాలు పొందుతారు.

వృషభ రాశి: వ్యాపారంలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి మంచి అవకాశం లభిస్తుంది. సొంతంగా వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో గణనీయమైన లాభాలు కలుగుతాయి. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తారు.

కన్య రాశి:  గ్రహాల రాకుమారుడు బుధుడు కన్య రాశి అధిపతి. శని, బుధుడు స్నేహపూర్వక గ్రహాలు. ఫలితంగా ఈ రాశి వారికి శని విజయాన్ని ఇవ్వబోతున్నాడు. అదృష్టం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులకు మంచి రోజులు మొదలవుతాయి. ఉద్యోగంలో లాభాలు ఉంటాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి శని నక్షత్ర మార్పు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. కోరుకున్న మార్పుతో మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామి పట్ల విధేయత చూపుతారు. గొడవలు పరిష్కరించుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది. లవ్ లైఫ్ రొమాంటిక్ గా ఉంటుంది.

మకర రాశి: శని సంచారం వల్ల ఊహించని విధంగా నగదు ప్రయోజనాలు పొందుతారు. సామాజిక స్థితి మెరుగుపడుతుంది. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేస్తారు.

కుంభ రాశి : శని కుంభ రాశి వారికి మంచి సమయాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ సమయంలో అనుకున్న పనులు నెరవేరుతాయి. అదృష్టం వెన్నంటే ఉంటుంది. జీవితం సౌకర్యవంతంగా గడుపుతారు. విదేశీ ప్రయాణాలు కలసి వస్తాయి.