ప్రతి ఒక్కరు చదువుకోవాలనేది కాకా తపన : సరోజా వివేక్

అంబేద్కర్ స్పూర్తితో కాకా వెంకటస్వామి విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని బీఆర్ అంబేద్కర్ లా కాలేజ్ కరస్పాండెంట్ సరోజా వివేక్  అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆమె.. చదువు విలువ తెలిసిన వ్యక్తిగా కాకా విద్యాసంస్థలు పెట్టారని చెప్పారు. మహాత్మ స్ఫూర్తితో కాకా సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. ఆర్థిక స్థోమత లేనివారి కోసం విద్యాసంస్థలు పెట్టారన్నారు. ప్రతి ఒక్కరు చదువుకోవాలనేది కాకా తపన అని చెప్పారు. అంబేద్కర్ కాలేజీలో చదివిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు.

అంబేద్కర్ పేరు మీద విద్యార్థులకు సేవ చేస్తున్నామని చెప్పారు సరోజా వివేక్. అంబేద్కర్ విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నారన్నారు. కాలేజీలో ఒక్క పైసా డొనేషన్ తీసుకోవడం లేదన్నారు.  80 శాతం మార్కులు వచ్చిన  విద్యార్థులకు ఫ్రీ ఎడ్యూకేషన్ ఇస్తున్నామన్నారు. 

Also Read :- అంబేడ్కర్ ఇన్ స్టిట్యూట్ లో ఘనంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కాకా వెంకటస్వామి వర్థంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిగాయి. గోల్డెన్ జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,  ఎమ్మెల్యేలు నాగరాజు, వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అంబేద్కర్ కాలేజీల సెక్రటరీ వినోద్, కరస్పాండెంట్ డాక్టర్ సరోజ హాజరయ్యారు.