న్యూజిలాండ్ తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీతో సత్తా చాటాడు. 110 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ముంబై ఆటగాడు ప్రస్తుతం 107 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. టెస్టు కెరీర్ లో సర్ఫరాజ్ కు ఇదే తొలి సెంచరీ. అతని ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఓవర్ నైట్ స్కోర్ 70 పరుగుల వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన సర్ఫరాజ్ వేగంగా తన సెంచరీ మార్క్ అందుకున్నాడు.
ఈ ఏడాది ఇంగ్లాండ్ పై అరంగేట్రం చేసిన అతను.. తొలి టెస్టులో హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. సర్ఫరాజ్ సెంచరీతో భారత్ రెండో ఇన్నింగ్స్ లో పటిష్ట స్థితికి చేరుకుంది. నాలుగో రోజు ఉదయం సెషన్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం 3 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. క్రీజ్ లో సెంచరీ హీరో సర్ఫరాజ్ తో పాటు పంత్ (23) ఉన్నాడు. ప్రస్తుతం భారత్ 62 పరుగులు వెనకబడి ఉంది. భారత్ చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. నాలుగో రోజు ఆటలో ఎవరు పై చేయి సాధిస్తారో వారు ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశముంది.
????? ????, ?'? ???????????! ?
— JioCinema (@JioCinema) October 19, 2024
Maiden century in Test cricket for the rising star, #SarfarazKhan ?#IDFCFirstBankTestTrophy #INDvNZ #TeamIndia #JioCinemaSports pic.twitter.com/vsB9IhfGTh