IND vs BAN 2024: టీమిండియా స్క్వాడ్ నుంచి సర్ఫరాజ్ ఔట్.. కారణం ఏంటంటే..?

బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు టీమిండియా స్క్వాడ్ లో సర్ఫరాజ్ చోటు దక్కించుకున్నాడు. అయితే అతడు రెండో టెస్టుకు జట్టులో భారత జట్టు ఉంచి రిలీజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇరానీ కప్ లక్నో వేదికగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరుగుతుంది. రంజీ ట్రోఫీ విన్నర్ ముంబైతో ఈ మ్యాచ్ లో రెస్టాఫ్ ఇండియా తలబడుతుంది. ఈ మ్యాచ్ సర్ఫరాజ్ ఆడాలనుకున్నట్టు సమాచారం. 

కాన్పూర్ వేదికగా రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతుంది. మరోవైపు ఇరానీ కప్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ ఆడిన జట్టుతోనే రెండో టెస్ట్ ఆడే అవకాశముంది. దీంతో సర్ఫరాజ్ భారత జట్టు స్క్వాడ్ ను వదిలి ఇరానీ కప్ కోసం కాన్పూర్ నుండి లక్నోకు వెళ్లే అవకాశముంది. కాన్పూర్ టెస్ట్ ప్రారంభమైన తర్వాత కూడా సర్ఫరాజ్ లక్నోకు బయలుదేరవచ్చు. చివరి నిమిషంలో ఎవరైనా గాయపడితే తప్ప సర్ఫరాజ్ జట్టు నుంచి రిలీజ్ అవ్వడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. 

Also Read:-ఒకే ఏడాది 150 సిక్సులు.. టీ20ల్లో విండీస్ బ్యాటర్ సరికొత్త చరిత్ర

ఇరానీ కప్ ముంబై గెలవాలంటే సర్ఫరాజ్ ఆ జట్టుకు చాలా కీలకం. కొన్నేళ్లుగా రంజీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి టెస్ట్ ప్లేయింగ్ 11 లో సర్ఫరాజ్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. రాహుల్ తిరిగి భారత జట్టులోకి చేరడంతో సర్ఫరాజ్ కు నిరాశ తప్పలేదు.  ఇంగ్లాండ్ పై ఈ ఏడాది తొలి సారి భారత జట్టులో స్థానం సంపాదించుకొని ఆడిన తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.