207మంది దంపతులతో సరస్వతి హోమం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్  పట్టణంలో కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 207 మంది దంపతులతో సరస్వతి హోమం నిర్వహించారు. ముందుగా భక్తులు సూర్య నమస్కారాలు చేసి పూజలు నిర్వహించారు.

గోపూజ, యాగశాల ప్రదక్షిణ, వేద హోమం, చండీహోమం, రుద్రహోమం వేద మంత్రోచ్ఛరణల మధ్య  వైభవంగా జరిపించారు. 22 మంది దంపతులు సంతాన ప్రాప్తికి పుత్ర కామేష్టి హోమం నిర్వహించారు. సాయంత్రం చిన్న పిల్లలను అమ్మవారి రూపంగా తయారు చేసి బాలపూజలు చేశారు. అనంతరం పరమేశ్వరుడికి బిల్వదళాలతో విశేష అర్చన నిర్వహించారు.