రామకృష్ణమఠంలో శారదామాత జయంతి

హైదరాబాద్, వెలుగు: శారదమాతకు భక్తులపై అపారమైన ప్రేమ ఉండేదని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద అన్నారు. నగరంలోని దోమలగూడలో ఉన్న శ్రీరామకృష్ణ మఠంలో శ్రీ శారదామాతా 172వ జయంతి ఉత్సవాలు కనుల పండువగా సాగాయి. ఉదయం సుప్రభాతం, మంగళహారతి, భజనలతో జయంతి వేడుకలు ప్రారంభం అయ్యాయి. అనంతరం దేవాలయ ప్రదక్షిణం, లలితా సహస్రనామ పారాయణం, హోమం నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటలకు వివేకానంద ఆడిటోరియంలో భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వాలంటీర్స్,  భక్తులు తమ బంధు మిత్రులతో పాల్గొన్నారు.