IND vs AUS 3rd Test: గబ్బా టెస్టుకు సారా టెండూల్కర్.. గిల్‌పైనే అందరి చూపు

భారత్, ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చూసేందుకు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ వచ్చింది. విఐపి గ్యాలరీలో ఆమె మ్యాచ్ చూస్తూ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. సారా మ్యాచ్ చూడడానికి రావడంతో అందరి కళ్ళు టీమిండియా యువ బ్యాటర్ గిల్ పైనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సారా మ్యాచ్ కు హాజరు కావడంతో మరోసారి వీరి మధ్య పుకార్లు వస్తున్నాయి. 

గిల్ ఆడుతున్నప్పుడు రావడం సారాకు ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్, వన్డే వరల్డ్ కప్ సమయంలో ఆమె మ్యాచ్ లకు హాజరైంది. ఆశ్చర్యకరంగా సారా మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడల్లా గిల్ ఆట నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ పై సెంచరీతో పాటు వరల్డ్ కప్ లో శ్రీలంకపై గిల్ 92 పరుగులు చేశాడు. ఈ రెండు సందర్భాల్లో సారా మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వచ్చింది. మరోసారి ఆమె కనిపించడంతో గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ALSO READ : IND vs AUS 3rd Test: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. తొలి రోజు 13.2 ఓవర్లే

ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. తొలి సెషన్ లో మాత్రమే మ్యాచ్ జరగగా.. రెండు, మూడు సెషన్స్ పూర్తిగా వర్షం కారణంగా తుడిచిపెట్టుకొని పోయాయి. తొలి రోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. నాథన్ మెక్‌స్వీనీ(4), ఉస్మాన్ ఖవాజా (19) క్రీజ్ లో ఉన్నారు.