తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్... సంక్రాంతికి స్పెషల్ సర్వీసులు

తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లేందుకుTGSRTC స్పెషల్ బస్ సర్వీసులు నడపనుంది. హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు రడీ అవుతున్నారు.  ఇప్పటికే ట్రైన్ టిక్కెట్లు అన్నీ అయిపోయాయి. ఏది  ఎలాగున్నా... చాలచామంది సంక్రాంతి పండుగను ఓన్ విలేజ్ లో సంబరాలు చేసుకుంటారు.  హైదరాబాద్‌లో ఉండే ఏపీ ప్రజలు ముందే టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. సీట్లు దొరకవనే ఉద్దేశంతో ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో రిజర్వేషన్‌కు రద్దీ పెరిగిందని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు నగరాలకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు తెలిపారు. 

సిటీ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు వంటి రూట్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3 వేలకు పైగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు సమాచారం. పీలోని పలు నగరాలకు రైళ్లు అందుబాటులో ఉండడంతో దాదాపు సగం మంది రైళ్లల్లో వెళ్తారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. పైగా ఏపీలోని సొంతూళ్లకు రైలు సౌకర్యం ఉన్న ప్రాంతాలకు జనం రైళ్లలో వెళ్లడం ప్రతీ ఏడాది కనిపించే ట్రెండే. అయినప్పటికీ గతేడాది రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా  టీజీఎస్ ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. 

ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం యథావిధిగా కొనసాగుతుంది. అయితే, ఎప్పట్లానే అది పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్‌ప్రెస్ బస్సులకే పరిమితం. అయితే, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే జీరో టికెట్ వర్తిస్తుంది. ఆ తర్వాత మాత్రం టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జనవరి తొలి వారం నుంచి 17వ తేదీ వరకు పది రోజులపాటు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి.