ధోనీ, కోహ్లీ, రోహిత్, ద్రవిడ్ నా కొడుకు పదేళ్ల జీవితాన్ని నాశనం చేశారు: సంజు శాంసన్ తండ్రి

సంజు శాంసన్.. ప్రస్తుత టీ20 క్రికెట్ లో దూసుకుపోతున్నాడు. టీ20 క్రికెట్ లో ఇటీవలే వరుసగా రెండు సెంచరీలు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఓపెనర్ గా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. ప్రపంచ క్రికెట్ అంతా సంజుపై ప్రశంసలు కురిపిస్తుంటే అతని తండ్రి విశ్వనాథ్ భారత స్టార్ క్రికెటర్లు ధోనీ, కోహ్లీ, రోహిత్ తో పాటు ఇటీవలే భారత కోచ్ పదవికి రిటైర్మెంట్  ప్రకటించిన ద్రవిడ్ పై సంచలన ఆరోపణలు చేశాడు. 

మలయాళం అవుట్‌లెట్‌తో సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ మాట్లాడుతూ..నలుగురు వ్యక్తులు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ తన కొడుకు 10 సంవత్సరాల కెరీర్‌ను వృధా చేశారని తెలిపాడు. “ నా కొడుకు యొక్క 10 సంవత్సరాల కీలక కెరీర్‌ను వృధా చేసిన నలుగురు ఉన్నారు. కెప్టెన్లు ధోనీ జీ, విరాట్ (కోహ్లీ)జీ, రోహిత్(శర్మ)జీ, కోచ్ (రాహుల్) ద్రవిడ్ జీ. ఈ నలుగురు వ్యక్తులు నా కొడుకు జీవితాన్ని 10 ఏళ్లు నాశనం చేశారు. వాళ్ళందరూ ఎంతలా భాధించినా.. సంజు ధైర్యంగా  ముందుకు వెళ్ళాడు". అని తెలిపాడు. 

ALSO READ | Babar Azam: ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌కు బాబర్ అజామ్ జెర్సీ.. పాక్ క్రికెటర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!

2015లో అజింక్య రహానే కెప్టెన్సీలో సంజూ శాంసన్ టీ20 క్రికెట్ తో భారత జట్టులో అరంగేట్రం చేశాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్‌ల కెప్టెన్సీలో ఈ పదేళ్లలో చాలా మ్యాచ్ లు బెంచ్ కే పరిమితమయ్యాడు. శాంసన్ ఇకపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోలేడు. ఈ ముగ్గురూ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ కు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రధాన కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్‌తో శాంసన్ ఆడనున్నాడు. మెగా ఆక్షన్ కు ముందు శాంసన్ ను రూ. 18 కోట్ల రూపాయలు పెట్టి రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకుంది.