రోహిత్, విరాట్ రిటైర్మెంట్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్.. సత్తా నిరూపించుకుంటున్నాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ జట్టులో స్థానం పదిలం చేసుకుంటున్నాడు. శుక్రవారం కింగ్స్‌మీడ్ వేదికగా సఫారీలతో జరిగిన తొలి టీ20లో ఈ వికెట్ కీపర్ ఏకంగా సెంచరీ బాదాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. ఈ ప్రదర్సనతో శాంసన్ 7 రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
బద్దలైన రికార్డులివే..
- టీ20ల్లో వరుసగా సెంచరీలు చేసిన తొలి భారత బ్యాటర్.. శాంసన్. ఈ వికెట్ కీపర్/ బ్యాటర్ బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20లో కూడా సెంచరీ చేశాడు. చెన్నై వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో 47 బంతుల్లో 111 పరుగులు చేశాడు.
- ఎలైట్ జాబితాలో చోటు: ఈ సెంచరీతో శాంసన్.. దక్షిణాఫ్రికాపై టీ20ల్లో సెంచరీ చేసిన సురేశ్ రైనా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సరసన చేరాడు.
- సఫారీల గడ్డపై శతకం: దక్షిణాఫ్రికా గడ్డపై టీ20ల్లో ఆతిథ్య జట్టుపై సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్.. శాంసన్. గతేడాది జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూర్య 56 బంతుల్లో 100 పరుగులు చేశాడు.
- టీ20ల్లో బహుళ(ఒకటి కంటే ఎక్కువ) సెంచరీలు చేసిన భారత బ్యాటర్. రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4), కేఎల్ రాహుల్ (2), శాంసన్ (2).
- ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేసిన మూడో భారత బ్యాటర్.. సంజూ. రోహిత్ శర్మ 2018లో (ఇంగ్లాండ్‌పై 100*, వెస్టిండీస్‌పై 111*).. సూర్యకుమార్ యాదవ్ 2022లో(ఇంగ్లాండ్‌పై 117, శ్రీలంకపై 112*) ఈ ఘనత సాధించారు.
- టీ20ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు శాంసన్.. 107 పరుగులు. గతంలో ధర్మశాల వేదికగా జరిగిన టీ20లో రోహిత్ శర్మ 106(66 బంతులు) పరుగులు చేశాడు.
- ఈ మ్యాచ్‌లో శాంసన్ 10 సిక్సర్లు కొట్టాడు. ఒక టీ20 ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్‌కు ఇవే అత్యధిక సిక్సర్లు. 2017లో రోహిత్ శర్మ శ్రీలంకపై 10 సిక్సర్లు సాధించాడు. ఆ రికార్డును సంజూ సమం చేశాడు.
Sanju Samson becomes the first ?? batter to score consecutive ?s in T20Is (against Bangladesh, followed by South Africa), guiding India to a total of 202! ?
— Star Sports (@StarSportsIndia) November 8, 2024
He has also become the fastest indian to score a 100 in T20Is against South Africa ?#SanjuSamson #INDvSA #Cricket pic.twitter.com/0EI7ckwR0d