Syed Mushtaq Ali Trophy 2024: శాంసన్‌కు ప్రయోషన్.. కెప్టెన్‌గా బాధ్యతలు

వరుస సెంచరీలతో భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ ప్రమోషన్ అందుకున్నాడు. కేరళ జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను కేరళ జట్టును నడిపించనున్నాడు. ఈ మేరకు కేరళ క్రికెట్ అసోసియేషన్ (KCA) ప్రకటన చేసింది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది.

5 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు

ఈ ఏడాది శాంసన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లోసెంచరీ చేసిన సంజూ.. ఆ తరువాత సౌతాఫ్రికా పర్యటనలో రెండు వరుస సెంచరీలు బాదాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన మొదటి వికెట్ కీపర్‌గా నిలిచాడు. అంతేకాదు, టీ20 ఫార్మాట్‌లో ఒక ఏడాదిలో మూడు సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

Also Read :- భారత జట్టులో ఈ సారి అతను లేకపోవడం సంతోషంగా ఉంది

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్

మొత్తం తొమ్మిది జట్లు తలపడే ఈ టోర్నీ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనుంది.  

  • బెంగాల్
  • ఢిల్లీ
  • ఉత్తరప్రదేశ్
  • ముంబై 
  • తమిళనాడు
  • జమ్మూ కాశ్మీర్
  • కర్ణాటక
  • కేరళ
  • మహారాష్ట్ర