లారీలో పట్టుబడిన 800 క్వింటాళ్ల గంజాయి

  • చెక్ పోస్టు వద్ద ఆపి పరారైన డ్రైవర్, క్లీనర్
  • సంగారెడ్డి జిల్లాలోని మాడిగి వద్ద ఘటన

సంగారెడ్డి, వెలుగు: లారీలో గంజాయి తరలిస్తూ పట్టుబడగా చెక్ పోస్టు వద్ద ఆపి డ్రైవర్ క్లీనర్ పరారైన  ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. లారీలో ఎండు గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో మొగుడంపల్లి మండలం మాడిగి అంత రాష్ట్ర చెక్ పోస్టు వద్ద శుక్రవారం పుణె, గోవాకు చెందిన డీఆర్ఐ, సెంట్రల్ విజిలెన్స్ టీమ్ లు తనిఖీలు చేపట్టాయి. 

అక్కడికి లారీ రాగానే అధికారులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వెంబడించారు. చెక్ పోస్టు వద్దకు లారీ రాగానే డ్రైవర్, క్లీనర్ దిగి ఆర్టీఏ చెక్ పోస్టులోకి వెళ్లి కాగితాలు చూయించినట్టు నటించి పరార్ అయ్యారు. డీఆర్ఐ సిబ్బంది లారీని చిరాక్ పల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. తనిఖీ చేయగా అందులో 800 క్వింటాళ్ల ఎండు గంజాయి బ్యాగులు దొరికాయి.  కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు, డీఆర్ఐ అధికారులు వివరాలు తెలపలేదు.