సంగమేశ్వరం పనులు చేస్తలేం.. ఎన్‌జీటీ ఎదుట ఏపీ బుకాయింపు

సంగమేశ్వరం పనులు చేస్తలేం.. ఎన్‌జీటీ ఎదుట ఏపీ బుకాయింపు
ప్రిపరేటరీ వర్క్స్​, స్టడీ మాత్రమే  చేస్తున్నట్లు వాదన పనులు చేస్తలేమని అఫిడవిట్‌ వేయాలన్న ఎన్​జీటీ దాన్ని చూసి ఎంక్వైరీ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం  తీసుకుంటామని వెల్లడి విచారణ జనవరి 18కి వాయిదా హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌ స్కీం పనులు చేయడం లేదంటూ నేషనల్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌(ఎన్​జీటీ) ఎదుట ఏపీ ప్రభుత్వం బుకాయించింది. కేవలం ప్రిపరేటరీ పనులు, స్టడీ మాత్రమే చేస్తున్నట్లు పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఎన్‌‌‌‌జీటీ తీర్పును పట్టించుకోకుండా సంగమేశ్వరం లిఫ్ట్‌‌‌‌ స్కీం పనులు ప్రారంభించిందని పేర్కొంటూ నారాయణపేట జిల్లా బాపన్‌‌‌‌పల్లి మాజీ సర్పంచ్‌‌‌‌ గవినోళ్ల శ్రీనివాస్‌‌‌‌ ఎన్‌‌‌‌జీటీ చెన్నై బెంచ్‌‌‌‌లో ధిక్కార పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. సోమవారం ఎన్‌‌‌‌జీటీ జ్యుడీషియల్‌‌‌‌ మెంబర్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ రామకృష్ణన్‌‌‌‌, ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌ మెంబర్‌‌‌‌ సైబల్‌‌‌‌ దాస్‌‌‌‌ గుప్తా వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ ద్వారా విచారణ జరిపారు. పిటిషనర్‌‌‌‌ తరఫున సుప్రీంకోర్టు అడ్వొకేట్‌‌‌‌ శ్రావణ్‌‌‌‌కుమార్‌‌‌‌ వాదనలు వినిపించారు. ఎన్‌‌‌‌జీటీ ఆదేశాలను ఏపీ పట్టించుకోకుండా లిఫ్ట్‌‌‌‌ స్కీం పనులను ప్రారంభించిందన్నారు. పిటిషనర్‌‌‌‌ అభ్యంతరాలపై ఏపీ సర్కార్​ తరఫున అడ్వకేట్​వెంకట రమణిని బెంచ్​ వివరణ కోరింది. తాము అక్కడ ఎలాంటి పనులు చేపట్టడం లేదని వెంకట రమణి చెప్పారు. పంపుహౌస్‌‌‌‌ ప్రారంభించడానికి అవసరమైన ప్రిపరేటరీ వర్క్స్‌‌‌‌తో పాటు స్టడీ మాత్రమే చేస్తున్నామన్నారు. ఎన్‌‌‌‌జీటీ జ్యుడీషియల్‌‌‌‌ మెంబర్‌‌‌‌ జస్టిస్​ రామకృష్ణన్​ స్పందిస్తూ.. పనులు చేస్తలేమనేదాన్ని అఫిడవిట్​ రూపంలో ఫైల్‌‌‌‌ చేయాలని ఆదేశించారు. పనులు చేయొద్దంటూ తాము గతంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంలో అప్పీల్‌‌‌‌కు వెళ్లారా అని ప్రశ్నించారు. ఏపీ అడ్వొకేట్‌‌‌‌ బదులిస్తూ.. తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, ఎన్‌‌‌‌జీటీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్‌‌‌‌జీటీ తీర్పుపై తాము అప్పీల్‌‌‌‌కు వెళ్లలేదని వివరణ ఇచ్చారు. పిటిషనర్‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌ జోక్యం చేసుకొని.. తాము లేవనెత్తిన అంశాలపై ఇండిపెండెంట్‌‌‌‌ కమిటీతో విచారణ జరిపించాలన్నారు. జస్టిస్‌‌‌‌ రామకృష్ణన్‌‌‌‌ స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్‌‌‌‌ అడ్వొకేట్‌‌‌‌ చెప్పిన వివరణను రికార్డు చేశామని  చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఆఫీసర్లు నిజాలు దాచే అవకాశం కూడా లేకపోలేదన్నారు. ఏపీ అఫిడవిట్‌‌‌‌లో ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాత తాము సంతృప్తి చెందకపోతే ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి తనిఖీలు జరిపించడానికి సిద్ధమని చెప్పారు. అన్ని వివరాలతో అఫిడవిట్‌‌‌‌ ఫైల్‌‌‌‌ చేయాలని ఏపీని ఆదేశిస్తూ విచారణను జనవరి 18కి వాయిదా వేశారు.