ఆ లేఖలో ఏముంది.. షోకాజ్ నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం సమాధానం

హైద్రాబాద్ సంధ్య థియేటర్ ఘటనపై పోలీసుల షోకాజ్ నోటీసులకు యాజమాన్యం ఇచ్చింది.  సంధ్య థియేటర్ ఘటనపై- 6 పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు పంపింది థియేటర్ యాజమాన్యం.  సంధ్య థియేటర్ యాజమాన్యం. సంధ్య థియేటర్ కు అన్ని అనుమతులు ఉన్నాయిని నోటీసులో యాజమాన్యం పేర్కొంది. - గత 45 ఏళ్లుగా ఈథియేటర్ ప్రేక్షకులకు అందుబాటులో ఉందని..  గతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని తెలిపింది.

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లో 80 మంది  తమ సిబ్బంది విధుల్లో ఉన్నారని పోలీసులకు యజమాన్యం తెలిపింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో థియేటర్ నిర్వహణ బాధ్యతను మైత్రి మూవీస్ తీసుకుందని లేఖ ద్వార తెలిపింది.  గతంలో అనేక సినిమాల విడదల సందర్భంగా హీరోలు, ప్రముఖ నటులు  థియేటర్ కు వచ్చి  సినిమాలను వీక్షించారని.. ఎన్నడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని పేర్కొంది.  సంధ్య థియేటర్లో కారులకు, ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఉందని, భద్రతా పరమైన చర్యలు తీసుకున్నామని పోలీసులకు థియేటర్ యజమాన్యం తెలిపింది.

ALSO READ | స్టార్ హీరోతో డేటింగ్ పై స్పందించిన వెటరన్ హీరోయిన్... ఏమన్నారంటే..?

పుష్ప-2 ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న విషయం తెలిసిన విషయమే. ఈ ఘటనపై  యాజమాన్యాన్ని బాధ్యులుగా చేస్తూ థియేటర్ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని చిక్కడపల్లి  పోలీసులు షోకాజ్ నోటీసులు పంపించారు. పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం 6 పేజీల లేఖ ద్వారా సమాధానం పంపింది.