నాకు తెలియదు.. గుర్తు లేదు..: బౌన్సర్లపై ప్రశ్నలకు.. బన్నీ సమాధానం ఇదే

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ కు శాపంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే జైలుకెళ్లొచ్చిన బన్నీ మరోసారి పోలీసు విచారణకు హాజరయ్యాడు. పోలీసులు బన్నీని తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. థియేటర్కు ఆ రోజు అల్లు అర్జున్ బౌన్సర్లతో రావడంపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో గంటన్నరకు పైగా అల్లు అర్జున్ను పోలీసులు విచారిస్తున్నారు. ఏసీపీ ఆధ్వర్యంలోని టీం.. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఇదే సమయంలో కీలకమైన బౌన్సర్ల అంశాన్ని పోలీసులు ప్రస్తావించారు. బౌన్సర్లపై పోలీసులు వేసిన ప్రశ్నలకు.. అల్లు అర్జున్ నుంచి సరైన సమాధానం రాలేదంట. ‘‘నాకు తెలియదు.. గుర్తు లేదు’’ అని చెబుతున్నట్లు తెలుస్తోంది.

ప్రశ్న 1 : మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందిన వారు..?
ప్రశ్న 2 : మీతో ఉన్న బౌన్సర్లను మీరు గుర్తు పడతారా..?
ప్రశ్న 3 : మీరు ఎంత మంది బౌన్సర్లను నియమించుకున్నారు.,.?
ప్రశ్న 4: మీరు నియమించుకున్న బౌన్సర్లు మీతో ధియేటర్ దగ్గరకు ఎలా వచ్చారు..?
ప్రశ్న 5: అభిమానులపై దాడి చేసిన బౌన్సర్ల వివరాలు చెప్పండి..?
ప్రశ్న 6: పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు చెప్పండి.. ?

‘‘నాకు తెలియదు.. నా టీం చూసుకుంటుంది ఈ వ్యవహారాలు.. ఆ బౌన్సర్లను నేను గుర్తు పట్టలేను.. మర్చిపోయాను.. నాకు తెలియదు.. ఈ వ్యవహారాలు అన్నీ నా టీం చూసుకుంటుంది.. నా మేనేజర్, ఇతర సభ్యులు ఈ సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకుంటారు’’ అంటూ సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్లో ప్రదర్శించిన ప్రీమియర్ షో అల్లు అర్జున్ కు మనశ్శాంతిని దూరం చేసిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో సమయంలో థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు. అభిమానుల మీద, పోలీసుల మీద అతని బౌన్సర్లు దాడి చేయడం గురించి పోలీసులు ఆరా తీశారు.

ALSO READ : ఈ ప్రశ్నలకు మీ సమాధానం ఏంటీ..: విచారణలో అల్లు అర్జున్ ఉక్కిరిబిక్కిరి

ఎంత మంది బౌన్సర్లను నియమించుకున్నారనే విషయంలో, బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించారనే విషయంలో అల్లు అర్జున్పై ప్రశ్నలు సంధించారు. అయితే.. బౌన్సర్ల గురించి ప్రశ్నించిన సందర్భంలో అల్లు అర్జున్ తడబడినట్లు తెలిసింది. బౌన్సర్ల నియామకంపై, బౌన్సర్ల తీరుపై ఏం అడిగినా అల్లు అర్జున్ ‘తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయాను’ అనే రీతిలో స్పందించినట్లు తెలిసింది.