యారొనిపల్లిలో జోరుగా సాగుతున్న ఇసుక దందా

  • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

హన్వాడ, వెలుగు: మండలం యారొనిపల్లితో పాటు మునిమోక్షం, బుద్దారం, వెంకటమ్మకుంట తండాల శివారులోని కటికోనికుంట అడవి భూముల్లో ఇసుక దందా జోరుగా సాగుతోంది. గుంతలు తొవ్వుతూ ఇసుకను ఫిల్టర్ చేసి పంట పొలాల్లో డంప్ చేసుకుని ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. 

దీనిపై ఫారెస్టు, రెవెన్యూ, పోలీసులు అధికారులకు  సమాచారం ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక దోపిడీతో భూగర్భ జలాలు పడిపోయి బోర్లు ఎండిపోతున్నాయని వాపోతున్నారు.