శాంసంగ్ ఆఫర్స్ : ఎస్10 సిరీస్ ఫోన్ల మీద 20వేల వరకు క్యాష్ బ్యాక్

శాంసంగ్ ఆఫర్స్ : ఎస్10 సిరీస్ ఫోన్ల మీద 20వేల వరకు క్యాష్ బ్యాక్

న్యూ ఇయర్ ప్రారంభంలోనే స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్ని అట్రాక్ట్ చేసేందుకు శాంసంగ్ భారీ ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా శాంసంగ్  ఫ్లాగ్ షిప్ గెలాక్సీ ఎస్ 10ప్లస్, ఎస్ 10, ఎస్10ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ మూడు సిరీస్ ఫోన్లు ఎవరు కొనుగోలు చేసినా 20వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఫోన్ కొన్న ఫీచర్స్ ఆధారంగా ఆఫర్ వర్తించనున్నట్లు సమాచారం. ఆఫర్ జనవరి 4 నుంచి జనవరి 31వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ నిర్వాహాకులు చెబుతున్నారు.

గెలాక్సీ ఎస్ 10 యొక్క 512 జీబీ, 128 జీబీ వేరియంట్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు వరుసగా రూ .20,000, రూ .12,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు

అదేవిధంగా, పెద్ద డిస్ ప్లే  కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు గెలాక్సీ ఎస్ 10 +, 512 జీబీ మరియు 128 జీబీ వేరియంట్‌ను 12,000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు.

కాంపాక్ట్ పవర్ ప్యాక్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ  ఎస్ 10ఈ కొనుగోలు చేస్తే రూ.8000క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుందని కంపెనీ ప్రకటించింది.దీంతో పాటు

గెలాక్సీ ఎస్ 10ప్లస్, ఎస్ 10, ఎస్10ఈ ఫీచర్స్ ఎలా  ఉన్నాయి…?

గెలాక్సి ఎస్ 10ఈ 5.8 అంగుళాలు, ఎస్ 10 –  6.1 అంగుళాలు, ఎస్ ప్లస్ 10 – 6.4 అంగుళాల పొడవు ఉంటుంది. ప్రపంచంలోనే తొలిసారిగా డైనమిక్ అమోలెడ్ డిస్ ప్లే తో ఫోన్లను డిజైన్ చేసింది.

గెలాక్సీ ఎస్ 10 హైడైనమిక్ రేంజ్ వీడియోతో పాటు, డైనమిక్ టోన్ మ్యాపింగ్ చేసేందుకు హెల్ప్ చేస్తుంది.  యాంటీ స్పూఫింగ్ కోసం, కదులు చిన్న చిన్న 3D ఆకృతులను గుర్తించడంతో పాటు,   ఇన్-డిస్ ప్లే  అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ స్క్రీన్ క్రింద నేరుగా డిజైన్ చేసి ఉంది. ,  ఫోన్‌ను సురక్షితంగా క్లిష్టపరిస్థితుల్లో సైతం అన్‌లాక్ చేయడానికి అనుమతిస్తుంది.

ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ తోపాటు శామ్‌సంగ్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంటాయని శాంసంగ్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.