కొరియా స్మార్ట్‌ఫోన్ మేకర్ శామ్‌సంగ్ తన మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ‘ఏ30ఎస్’ 128 జీబీ వెర్షన్‌ను ఇండియాలో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్ + 128 జీబీ వెర్షన్ ధర రూ.15,999. అయితే 4జీబీ ర్యామ్ + 64జీబీ యూనిట్ ధర రూ.14,999. ఇందులో 6.4 ఇంచుల సూపర్ అమోలెడ్ స్క్రీన్, ఈక్సినోస్ 7904 ప్రాసెసర్, వెనుక మూడు కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.
