యువ కస్టమర్లే లక్ష్యంగా శామ్‌సంగ్ ‘గెలాక్సీ ఏ10ఎస్’ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. 2జీబీ ర్యామ్/32జీబీ మొమెరీ వెర్షన్ ధర రూ.9,499 కాగా, 3జీబీ ర్యామ్/32జీబీ మొమెరీ వెర్షన్ ధర రూ.10,499. దీని అమ్మకాలు బుధవారం నుంచి మొదలవుతాయి. ఇందులో 6.2 ఇంచుల డిస్‌ప్లే, అండ్రాయిడ్ 9 ఓఎస్, అక్టాకోర్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.
