Samantha: అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సమంత మూవీ

సమంత, వరుణ్ ధావన్ లీడ్ రోల్స్‌‌లో వచ్చిన వెబ్ సిరీస్‌‌ ‘సిటాడెల్ : హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌‌ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

తాజాగా ఈ సిరీస్‌‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్‌‌ అవార్డుకు (Film Critics Choice Awards) దీన్ని నామినేట్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న దర్శకులు రాజ్ అండ్ డీకే సంతోషం వ్యక్తం చేశారు.

30వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌‌లో ఉత్తమ విదేశీ భాష సిరీస్‌‌ కేటగిరీ నామినేషన్స్‌‌లో చోటు దక్కినట్టు చెప్పారు. జనవరి 12న ఈ అవార్డుల వేడుక జరగనుంది. ఇక ఈ నామినేషన్స్‌‌లో పాపులర్‌‌‌‌ కొరియన్ సిరీస్ ‘స్క్విడ్‌‌ గేమ్‌‌’ సహా మొత్తం ఎనిమిది వెబ్ సిరీస్‌‌లు స్థానం దక్కించుకున్నాయి.