సమగ్ర శిక్ష అభియాన్​ ఉద్యోగుల టెంట్​ తొలగింపు

  •     వంద మందిని రూరల్​ పోలీస్​స్టేషన్​కు తరలించిన పోలీసులు

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ జిల్లా కేంద్రమైన పట్టణంలోని చర్చిని సందర్శించేందుకు సీఎం రేవంత్​రెడ్డి వచ్చిన నేపథ్యంలో మెదక్​ జిల్లా కలెక్టరేట్​ ఆవరణలో సమగ్ర శిక్ష అభియాన్​ ఉద్యోగుల టెంట్​ను తొలగించి వంద మంది వరకు ఉద్యోగులను మెదక్​ రూరల్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు.  సీఎం రేవంత్​ రెడ్డి తిరుగు ప్రయాణంలో జిల్లా ఎస్పీ ఆఫీసులో ఉన్న హెలీప్యాడ్​కు మెదక్​ చర్చి నుంచి కాన్వాయ్​ ద్వారా చేరుకోనున్నందున ముందుస్తుగా పోలీసులు కలెక్టర్ కార్యాలయం వద్ద సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల టెంట్ తొలగించారు.

ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  పోలీసులు కొందరు ఉద్యోగులను సీఎంను కలిసి మెమోరాండం సమర్పించేందుకు తీసుకెళ్లినప్పటికీ  వీఐపీలు, రాజకీయ నాయకుల తాకిడికి సమగ్ర శిక్షణ ఉద్యోగులు ఎలాంటి మెమోరాండం ఇవ్వకుండానే నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.