కూతురు పుట్టిందనే సంతోషంతో ఫ్రీగా హెయిర్ కటింగ్, షేవింగ్

కూతురు పుట్టిందనే సంతోషంతో ఫ్రీగా హెయిర్ కటింగ్, షేవింగ్
ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. కానీ ఇటీవల తన కోడలికి ఆడబిడ్డ పుట్టిందని అత్తగారింట శిశువుకు ఘన స్వాగతం పలికి పూల పరుపుపై పడుకోబెట్టిన విషయం తెలిసిందే. రావమ్మా మహాలక్ష్మీ అంటూ వెల్ కమ్ చెప్చి సంతోషం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో జరిగింది. తనకు ఆడపిల్ల పుట్టిందనే ఆనందంలో ఓ సెలూన్ యజమాని వెరైటీ ఆఫర్ ప్రకటించాడు. తన ఇంటికి గారాలపట్టి వచ్చినందుకు సోమవారం ఫ్రీగా హెయిర్ కటింగ్, షేవింగ్ చేశాడు. మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చెందిన సల్మాన్ కు ఇటీవల ఆడబిడ్డ పుట్టింది. ఆ సంతోషంలో తనకున్న 3 సెలూన్లలో ఫ్రీగా సేవలు అందించాడు. కూతురు పుట్టిందని ఎవరూ బాధపడకుండా, సంతోషంగా ఉండాలనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే  ప్రయత్నం  చేసినట్లు తెలిపాడు సల్మాన్.