డ్రగ్స్ విషయంలో టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉందని అనుమానిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.తప్పించుకోవడానికే మాపై నిందలు వేస్తున్నారన్నారు సజ్జల. విశాఖ డ్రగ్స్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలున్నాయని తెలిపారు.
విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయ రంగు పులుముకుంది. దీనిపై అధికార-విపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. డ్రగ్స్ విషయంలో బీజేపీ-, టీడీపీ నేతల పాత్ర ఉందని అనుమానం వ్యక్తంచేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ. నేతలు తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా పురందేశ్వరి బంధువులకు ఆయా కంపెనీలతో సంబంధాలున్నాయన్నారు. ఈ వ్యవహారంపై కావాలనే తమపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని సీబీఐకి లేఖ రాస్తామన్నారు సజ్జల.
Also Read :మా వల్ల ఎలాంటి ఆటంకాలు లేవు
మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారు. లోకేష్ కూడా ప్యూచర్ లో సీఎం అవుతానని కలలు కంటున్నాడని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో మాట్లాడటానికి ఏమి లేక డ్రగ్స్ విషయంలో తప్పుడు నిందలు మాపై వేస్తున్నారని మేము భావిస్తున్నామని తెలిపారు. తప్పుడు ప్రచారం, అబద్దాలు మాట్లాడటం టీడీపీకి అలవాటు అయిందని సజ్జల పేర్కొన్నారు. తప్పు చేసి మాపై రివర్స్ ఆరోపణలు చేస్తున్నారు. మోకాలుకి, బట్టతలకు సంబంధం ఉందా..? అని ప్రశ్నించారు. కంటైనర్ లో దొరికిన డ్రగ్స్ వాళ్ల బంధువులకు సంబంధించినదేనని అన్నారు