టీడీపీ పార్టీ ప్రభుత్వంపై విషం కక్కుతుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 59 నియోజకవర్గాల్లో సామాజిక బస్సు యాత్ర జరిగిందన్నారు. చంద్రబాబుకు 175 నియోజకవర్గాలలో అభ్యర్ధులు ఉన్నారా?. మా గృహసారధులు వెళ్ళి ప్రతీ పధకం గురించీ ఇప్పటి వరకూ 30లక్షల ఇళ్ళకు వెళ్ళి తెలుసుకున్నారు. జగన్ చేసినవన్నీ ప్రజలకు తెలుసు కనుకనే వై ఏపీ నీడ్స్ జగన్ అని అడిగి తెలుసుకుంటున్నాం. సోషల్ ఆడిట్ జరుపుతూ, ఏం చేసామో బోర్డులు పెట్టి చెప్పగలుగుతున్నాం” అని సజ్జల తెలిపారు. ప్రజలకు సంబంధం లేని విషయాలు చెప్పడం రాజకీయ వ్యభిచారమన్నారు. చంద్రబాబు తప్పు చేస్తే లోకేష్ ఏడ్చుకుంటూ ఢిల్లీ వెళ్ళాడు. లోకేష్ ఒక జోకర్… వచ్చాడని జనాలు అనుకుంటున్నారు.
అర్హత ఉండి.. టీడీపీ వ్యక్తి అని ఎవరికైనా సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వం ఆపిందా అని సజ్జల ప్రశ్నించారు. అమలైన పథకాలు... పూర్తి చేసిన అంశాలు వదిలేసి చంద్రబాబు ఏదేదో మాట్లాడుతన్నాడని విమర్శించారు, . చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ అంటే, పెద్ద పెద్ద బిల్డర్లకు ఇసుక ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు. ఉచిత జేసీబీ, క్రేన్ పధకాలు చంద్రబాబు ఏమైనా పెట్టాడా అంటూ సజ్జల ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక ఐతే దెందులూరు ఎమ్మెల్యే ఎందుకు ఎమ్మార్వో జుట్టు పట్టుకున్నాడని ప్రశ్నలు గుప్పించారు.రు. ఏది నష్టం చేసిందో కచ్చితంగా మాట్లాడలేరని.. ఆసుపత్రుల్లో ఓపీలు తగ్గిపోయాయి అని హాస్యాస్పదంగా మాట్లాడతారని విమర్శించారు