సీఎం జగన్ పై రాయితో దాడి ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కి పడింది. ఈ దాడి వెనక ప్రతిపక్షాల కుట్ర ఉందని, టీడీపీకి సంబందించిన వారే ఈ దాడికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. సీఎం సభలో భద్రతా వైఫల్యం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.దాడి విషయంలో టీడీపీ స్పందన అన్యాయం అని అన్నారు. దాడిని ఖండించాల్సి పోయి సీఎం జగన్ మీదనే ఆరోపణలు చేయటం దారుణమని అన్నారు.
రాయి గనక కొంచెం కింద తగిలి ఉంటే కంటికి గాయం అయ్యుండేదని, కణతకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం ఉండేదని అన్నారు. ఈ దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని అనుమానం కలుగుతోందని, టీడీపీ నాయకుల స్పందన అనుమానాలకు బలం చేకూర్చుతోందని అన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ మీద దాడి జరిగితే కోడి కత్తి డ్రామా అని అవహేళన చేసారని, ఇప్పుడు నటన అంటూ అవహేళన చేయటం సిగ్గు చేటని మండి పడ్డారు.