ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉన్న ఉత్కంఠను రెట్టింపు చేశాయి శనివారం సాయంత్రం వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్. గెలుపుపై అధికార ప్రతిపక్షాలు ఎవరి ధీమాలో వారు ఉన్న నేపథ్యంలో సగం సంస్థలు వైసీపీదే అధికారమని తేల్చితే, సగం సంస్థలు కూటమిదే అధికారమని తేల్చాయి. ఈ క్రమంలో అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు సామాన్యుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కౌంటింగ్ పై పార్టీ శ్రేణులకు అవగాహన కలిగించటం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో సజ్జల ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో అడ్డమైన ఫిగర్స్ వస్తున్నాయని, వాటిని నమ్మొద్దని అన్నారు. వైసీపీ మంచి మెజారిటీతో గెలవబోతోందని అన్నారు. చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో పీహెచ్డీ ఉందని అన్నారు. బీజేపీ 400సీట్ల నినాదానికి తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ని తమకు అనుకూలంగా చెప్పించుకుందని అన్నారు.