వైసీపీ అభ్యర్థుల మార్పుపై క్లారిటీ ఇచ్చిన సజ్జల..

ఏపీలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. ప్రధాన పార్టీల నేతలంతా ప్రచారం చేస్తూ జనంలో ఉన్న నేపథ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. ఇప్పటికే అధికార పరాతిపక్షాలు అన్ని స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించటంతో నేతలంతా ప్రచారంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా, ఆశించిన సీటు దక్కని నేతలు పార్టీ ఫిరాయింపులు కూడా ముమ్మరం చేశారు. పార్టీ ఫిరాయింపుల ప్రభావం అభ్యర్థుల జాబితా మీద పడుతొంది. ముఖ్యంగా ఈ ప్రభావం పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో ఎక్కువగా ఉంది.

అయితే, వైసీపీ అభ్యర్థుల జాబితాలో మార్పులు ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై స్పందించిన వైసీపీ కీలక నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల క్లారిటీ ఇచ్చారు. అభ్యర్థుల జాబితాలో మార్పులు చేయాల్సిన అవసరం వైసీపీకి లేదని, అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన తమ సిస్టమాటిక్ గా వెళ్తుందని, కూటమి లాగా మూడు పార్టీలు కలవలేదని, వారిలాగా పదే పదే అభ్యర్థుల జాబితాలో మార్పులు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.