ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్‌లో స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, బి. సాయి ప్రణీత్ ఇండియా విమెన్, మెన్స్ టీమ్‌ను నడిపించనున్నారు. డెన్మార్క్ వేదికగా వచ్చే నెల జరిగే థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్‌తోపాటు అక్టోబర్‌లో ఫిన్లాండ్లో జరిగే సుదిర్మన్ కప్‌లో బరిలోకి దిగే ఇండియా జట్లను బాయ్ ఆదివారం ప్రకటించింది. స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ రెండు టోర్నీల్లో పాల్గొనడం లేదు. థామస్, ఉబెర్ కప్ లో పాల్గొనే 10 మందితో కూడిన విమెన్స్ టీమ్‌లో సైనా నెహ్వాల్‌తో పాటు ట్రయల్స్‌లో సత్తా చాటిన టాప్–3 సింగిల్స్ ప్లేయర్లకు చోటు దక్కింది. డబుల్స్‌లో సీనియర్లు అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డితో పాటు యంగ్‌స్టర్స్ తనిషా క్రస్టో, రుతుపర్ణకు చాన్స్ వచ్చింది. మెన్స్ సింగిల్స్‌లో ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్‌తోపాటు ట్రయల్స్‌లో టాప్2లో నిలిచిన కిరణ్ జార్జ్, సమీర్ వర్మ ఎంపికయ్యారు.
