Team India: భారత క్రికెటర్ సర్జరీ విజయవంతం.. బీసీసీఐకి యువ బ్యాటర్ కృతజ్ఞతలు

భారత యువ క్రికెటర్లలో అత్యంత ప్రతిభావంత క్రికెటర్లలో సాయి సుదర్శన్ ఒకరు. త్వరలోనే ఈ తమిళ నాడు యువ బ్యాటర్ టీమిండియా తరపున గొప్ప క్రికెటర్లలో ఒకడవుతాడని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఐపీఎల్ లో, దేశవాళీ క్రికెట్ లో ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న సాయి సుదర్శన్..త్వరలోనే భారత క్రికెట్ లో అన్ని ఫార్మాట్ లలో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఇదిలా ఉండగా.. సాయి సుదర్శన్ సర్జరీ చేయించుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.     

మంగళవారం (డిసెంబర్ 10) అతని సర్జరీ విజయవంతమైందని సాయి సుదర్శన్ ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. "త్వరలోనే కంబ్యాక్ ఇస్తాను. నా సర్జరీకి సహకరించిన బీసీసీఐకి, మెడికల్ టీంకు ధన్యావాదాలు. నన్ను ప్రేమించి, నాకు మద్దతు తెలిపినందుకు గుజరాత్ టైటాన్స్ ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు". అని సాయి సుదర్శన్ రాసుకొచ్చాడు. సాయి సుదర్శన్ కు ఎలాంటి సర్జరీ జరిగిందనే విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంది. 

Also Read :-  మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్ట్.. 86 వేల టికెట్స్ సోల్డ్ ఔట్

నవంబర్ 23 నుండి ఈ తమిళ నాడు బ్యాటర్ క్రికెట్ ఆడలేదు. చివరిసారిగా అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై మ్యాచ్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు సాయి సుదర్శన్ ఆస్ట్రేలియా ఏ పర్యటనలో అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా తొలి టెస్టులో 103 పరుగులు చేసి కంగారూల గడ్డపై ఔరా అనిపించాడు. ఐపీఎల్ లో సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్నాడు. అతడిని 2024 మెగా ఆక్షన్ కు ముందు గుజరాత్ రూ.8.50 కోట్ల రూపాయలు ఇచ్చి రిటైన్ చేసుకుంది.