Sai Pallavi: ఇంక ఊరుకోను.. వారిని కోర్టు మెట్లెక్కిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్

రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘రామాయణ’ (Ramayana) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో సహజ నటి సాయిపల్లవి (Sai Pallavi) సీతగా నటిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడ స్టార్ యశ్ రావణుడి పాత్ర పోషిస్తున్నాడు. 

అయితే.. రామాయణ మూవీ చేస్తున్న కారణంగా సాయి పల్లవి వెజిటేరియన్గా మారిందంటూ ఓ తమిళ వెబ్ సైట్లో కథనం వచ్చింది. దీనిపై తాజాగా తన ఎక్స్ అకౌంట్ ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. మరోసారి ఇలా తప్పుడు కథనాలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె మాటల్లోనే.. 

"చాలాసార్లు, నిజానికి ప్రతిసారీ నాపై నిరాధార పుకార్లు, తప్పుడు ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కొన్నిసార్లు అబద్ధాలను రాసినా మౌనంగా ఉంటూ వస్తున్నాను. కానీ ఇక ఈ నిరాధారమైన వార్తలను ఉపేక్షించేది లేదు. ఇలా నేను సైలెంట్ గా ఉంటే.. ఇది మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటుంది. ఇలా వదిలిపెడితే ఈ కల్పిత వార్తాలు అసలు ఆగేలా లేదు. ముఖ్యంగా నా సినిమా రిలీజ్, అనౌన్స్‌మెంట్ అయ్యే సమయాల్లో, నా కెరీర్లో ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే క్షణాల్లో ఇలాంటివి వస్తున్నాయి. ఇక నుంచి ఏదైనా పేరున్న మీడియా లేదా వ్యక్తుల నుంచి ఇలాంటి చెత్త స్టోరీలు వార్తలు లేదా పుకార్ల రూపంలో వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని" సాయి పల్లవి పెద్ద పోస్టు పెట్టి హెచ్చరించింది.

Also Read:-బిగ్ బాస్ తెలుగు8 గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!

నిజానికి సాయి పల్లవి ఎప్పుడూ వెజిటేరియనే. ఈ విషయాన్ని ఆమె గతంలోనూ పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. ఒక ప్రాణి ప్రాణం పోతుంటే నేను చూసి తట్టుకోలేను అంటూ చాలా సార్లు తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఇక తాను రామాయణ సినిమా కోసమే వెజిటేరియన్ గా మారానని అనడంపై తీవ్ర స్థాయిలో మండిపడింది సాయి పల్లవి. 

అయితే, ఇటీవలే సాయి పల్లవి నటించిన అమరన్ సినిమాకి ముందు కూడా ఇలానే వార్తలు వైరల్ అయ్యాయి. విరాటపర్వం మూవీకి ముందు సైతం బాయ్ కాట్ సాయి పల్లవి అని హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇలా ఏదోక రూపంలో సాయి పల్లవి సినిమాల ముందు.. వస్తున్న కథనాలు తన ప్రశాంతతను పోగొడుతున్నాయని తెలుస్తోంది. ఇక ఇలాంటి వార్తలు మళ్ళీ వస్తే.. తన నెక్స్ట్ స్టెప్ ఎంటనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హీరో నాగ చైతన్యతో కలిసి తండేల్ మూవీలోనూ నటిస్తోంది.