సాహితీ ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీలు సీజ్

సాహితీ ఇన్‌ఫ్రా ప్రీ లాంచింగ్ స్కాం కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏపీలో సాహితీ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలను సీజ్ చేశారు. ఈ కేసులో 1500 కోట్ల రూపాయలు వసూలు చేసి బిచానా ఎత్తివేసిన సాహితీ ఇన్‌ఫ్రా. 

సాహితీ ఇన్‌ఫ్రా ఆస్తులు కార్యాలయంలో సీసీఎస్ పోలీసుల  సోదాలు నిర్వహించారు. ఏపీలోని  సాహితీ ఇన్‌ఫ్రా, సాహితీ కన్స్ట్రాక్షన్, సాహితీ ఆర్కిటెక్ లో సీసీఎస్ పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఏపీలో సాహితీ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలను పోలీసులు సీజ్ చేశారు. 

సాహితి ఇన్‌ఫ్రాపై ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయి. ఫ్రీలాంచ్‌ పేరుతో కస్టమర్ల నుంచి వందల కోట్లను సాహితి ఇన్‌ఫ్రా వసూల్‌ చేసిన విషయం తెలిసిందే.

కాగా రియల్ ఎస్టేట్ పేరుతో 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు సాహితీ ఇన్‌ఫ్రాపై ఆరోపణలు వచ్చాయి. 38 అంతస్తుల అపార్ట్‌మెంట్‌ నిర్మాణం పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లు కేసు నమోదు అయింది.  ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.