కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం రాత్రి సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో శివలింగం, ఓంకారం, ఢమరుకం ఆకృతిలో ప్రమిదలు అలంకరించారు.

 కార్యక్రమంలో వేదపాఠశాల స్టూడెంట్స్​, అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.