మహిళ భద్రత షీ టీమ్స్​ ప్రధాన లక్ష్యం

కందనూలు, వెలుగు: మహిళలు, యువతులకు ఎలాంటి సమస్యలున్నా  పోలీసులను సంప్రదించాలని  నాగర్ కర్నూల్ జిల్లా షీ టీమ్స్​  ఇన్​చార్జి,  అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ అన్నారు. గురువారం బిజినేపల్లి మండల కేంద్రంలో జడ్పీహెచ్​ఎస్​  బాలికల ఉన్నత పాఠశాలలో  విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్​టిజింగ్, పోక్సో, షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పై అవగాహన కల్పించారు.  

చిన్న పిల్లల రక్షణ విషయంలో పోలీసు శాఖ   చర్యలు చేపడుతుందన్నారు. మహిళలు  ఫేస్ బుక్, వాట్సాప్  వినియోగంలో  జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫొటో లు, వీడియోలు పోస్టుచేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.  ఏ సమస్యలున్నా  నేరుగా సంప్రదించలేని వారు 8712657676, లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎస్ ఐ నాగ శేఖర్ రెడ్డి, షీ టీమ్ ఇన్​చార్జి  విజయలక్ష్మి , హెడ్ మాస్టర్ శ్రీదేవి,విద్యార్థులు పాల్గొన్నారు.