చిత్తూరు జిల్లాలో అదృశ్యమైన బ్యాంకు ఉద్యోగులు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం 10 మంది బ్యాంక్ ఉద్యోగుల బృందం సదాశివకోన జలపాతానికి వెళ్లారు. అయితే వారు దారి తప్పి అడవిలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఉద్యోగుల ఫోన్లు స్విచాఫ్‌లో ఉన్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో బ్యాంకు ఉద్యోగుల కోసం అటవీ ప్రాంతంలో వడమాల పేట పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి… సోమవారం వారి ఆచూకీ కనుగొన్నారు. ఉద్యోగుల ఫోన్లలో సిగ్నల్ లేకపోవడం కారణంగా ఎవరికీ అందుబాటులోకి రాలేదని పోలీసులు తెలిపారు. ఉద్యోగులందరినీ అడవి నుంచి క్షేమంగా వడమాలపేట పీఎస్‌కు తీసుకొచ్చారు. బ్యాంకు ఉద్యోగులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
